హ్యాపీ బర్త్ డే.. మెగాస్టార్

తెలుగు సినిమా దశ, దిశని మార్చేసిన స్టార్.. మెగాస్టార్. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

ఆగస్ట్ 22, 1955లో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు శివశంకర వరప్రసాద్. వెండితెరకు చిరంజీవిగా పరిచయమైన శివశంకర వరప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగి సుప్రీమ్ స్టార్ అయ్యాడు, అనతి కాలంలోనే మెగాస్టార్ అయ్యాడు. ‘పునాది రాళ్లు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ‘ఖైదీ’ సినిమా స్టార్ డమ్ తెచ్చుకొన్నారు.

2008లో రాజకీయ తెరంగ్రేటం చేశాడు. దాదాపు 9యేళ్ల తర్వాత ‘ఖైదీ నెం.150’ రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. తెలుగు తెరపై అప్పుడు.. ఇప్పుడు తానే నెం. 1 అని రుజువు చేసుకొన్నాడు. ఆయన 151చిత్రం కోసం స్వాత్రంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ కథని ఎంచుకొన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా టీజర్ ని మెగాస్టార్ తన పుట్టినరోజు కానుకగా.. ఒకరోజు ముందుగానే అందజేసిన సంగతి తెలిసిందే.సైరా టీజర్ ని చూస్తే.. చిరు చరిత్ర సృష్టించబోతున్నాడన్న విషయం అర్థవుతోంది.