హ్యాపీ బర్త్ డే నాని

నేచురల్ స్టార్ నానికి స్టార్ హీరో రేంజ్ సరిపోదు. అంతుకుమించిన స్టార్ హీరో నాని. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో నాటౌట్ గా కొనసాగుతున్నాడు నాని. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన ఏకైక హీరో అనిపించుకొంటున్నాడు. నిర్మాతగాను మారి ‘అ!’లాంటి వైవిధ్యమైన సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించాడు. నేడు నాని పుట్టినరోజు. త‌న కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో సింపుల్ గా పుట్టినరోజు వేడుకని జరుపుకొంటున్నాడు. మరోవైపు, స్నేహితులు, సన్నిహితులు, ఇండస్ట్రీ నుంచి నానికి జన్మదిన శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి.

ప్రస్తుతం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్-నానిల మల్టీస్టారర్ తెరకెక్కనుంది. హనురాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక, ఈరోజు పుట్టినరోజుని జరుపుకొంటోన్న నానికి తెలుగు మూవీస్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్.