హ్యాపీ బర్త్ డే ‘స్నేహ’

sneha (1)

అందం, నటనలోనూ నిండుదనం కనిపించే కథానాయిక స్నేహ. ఆమె అసలు పేరు సుహాసని. సినిమాల్లో స్నేహగా పరిచయమైంది. తెలుగు, తమిళ్, మలయాళంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకొంది. నేడు.. ఈ అందాల కథానాయిక పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్.

స్నేహా ‘ఎంగెనా ఒరు నీల పక్షి’ (2000) మలయాళ సినిమాతో తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళ్ లో Virumbigiren (2001) సినిమాలో నటించింది. ఈ సినిమాతో స్నేహా బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక, తెలుగులో ఆమె తొలిచిత్రం ‘తొలివలపు’. ఆ తర్వాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మహారధి, మధుమాసం, సంక్రాంతి, నీ సుఖమే నే కోరుకున్నా, దటీజ్ పాండు (2005), వెంకీ, ఏమండోయ్ శ్రీవారూ, రాధాగోపాళం, మనసు పలికే మౌనరాగం, ఆదివిష్ణు, పాండురంగ సినిమాల్లో నటించింది.

స్నేహా తాత వాళ్లు రాజమండ్రి వాస్తవ్యులు. ఆ తర్వాత వీరి కుటుంబం ముంబైలో స్థిరపడింది. స్నేహ కూడా అక్కడే పుట్టింది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకి పూర్తిగా దూరమైంది. ఆమె మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనుందని చెప్పుకొంటున్నారు. స్నేహా మళ్లీ తెరపై మెరవాలని, మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటోంది.. మీ తెలుగు మూవీస్.