హ్యాపీ బర్త్ డే త్రిష

త్రిష.. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్. ‘వర్షం’ సినిమాతో తెలుగు తెరకు పరియమైంది. ఇప్పటి వరకు మూడు దక్షిణ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకొంది. ముప్పై యేళ్లు వయసు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తోంది. నేడు త్రిష పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ తెలుగు మూవీస్ డాట్ కామ్.

మే 4,1983లో కృష్ణన్ – ఉమా దంపతులకు త్రిష జన్మించింది. వీళ్లది కేరళ బ్రహ్మాణ కుటుంబం. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన త్రిష.. ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు దక్కించుకొంది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికైంది. ఆ తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. ప్రస్తుతం ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ చేసింది.