‘ఆకాశవాణి’ బడ్జెట్ ఎంతో తెలుసా ?

దర్శకధీరుడు రాజమౌళి శైలికి భిన్నంగా ఆయన తనయుడు కార్తికేయ సినిమా ప్లాన్ చేసినట్టు సమాచారమ్. రాజమౌళి సినిమాలు భారీ బడ్జెట్ భారీతనంతో తెరకెక్కుతుంటాయి. కలెక్షన్స్ ఆ రేంజ్ లోనే ఉంటాయనుకోండి. కార్తికేయ నిర్మాతగా మారి తొలి సినిమాగా ‘ఆకాశవాణి’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అశ్విన్ గంగరాజుకు దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ తో ప్లాన్ చేశాడట కార్తికేయ. కేవలం రూ. 5కోట్లతో ‘ఆకాశవాణి’ని తీసుకురాబోతున్నట్టు సమాచారమ్. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న చిత్రం. ఇందులో అందరు కొత్త నటీనటులే కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. చిన్న సినిమాగా ఆకాశవాణిని తీసుకొచ్చి పెద్ద విజయాన్ని అందుకోవాలన్నది కార్తీకేయ లక్ష్యంగా కనిపిస్తోంది. మరీ.. అందులో ఎంత మేరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి.