అమరావతి’లో ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక ?

pawan-678x381

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 25వ సినిమాగా “అజ్ఝాతవాసి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, యూరప్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. త్వరలో వారణాసి షెడ్యూల్ మొదలవ్వనుంది. ఆ తర్వాత అలహాబాద్ షెడ్యూల్ ఉండనుంది. ఇప్పుడీ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటికొచ్చింది.

ఈ సినిమా ఆడియోని ఏపీ రాజధాని అమరావతిలో డిసెంబర్ 15న నిర్వహించనున్నట్టు సమాచారమ్. ఈ మేరకు దర్శక-నిర్మాతలు తీసుకొన్న నిర్ణయానికి పవన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్. రాథా కృష్ణ నిర్మాత. ఈ సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.