ఐష్ పదికోట్లకు భర్తని వదిలేసింది !

ఐశ్వర్యరాయ్‌ భర్త అభిషేక్ బచ్చన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినట్టు సమాచారమ్. భర్తతో కలిసి నటించేందుకు చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది ఐష్. ఇందుకోసం సరైన కథ కోసం వెయిట్ చేసింది. ఐతే, ఇటీవలే ఓ దర్శకుడు వినిపించిన కథని ఐష్-అభిషేక్ బచ్చన్ లు ఇద్దరు ఓకే చేశారట. ఐతే, కథలో ఐష్ కొన్ని మార్పులు సూచిందట. ఐష్ కోరిన విధంగానే సదరు దర్శకుడు కథలో మార్పులు చేసి తీసుకెళ్లాడట.

ఐష్ మాత్రం ప్లేట్ ఫిరాయించినట్టు సమాచారమ్. ఇప్పుడు ఈ సినిమా చేయలేనని, మరో సినిమా కోసం రూ. 10 కోట్లు తీసుకున్నానని ఐష్ చెప్పిందట. దీంతో ఆ సినిమా పూర్తయిన తర్వాతే ఈ సినిమా చేస్తానని చెప్పినట్టు సమాచారమ్. దీంతో.. భర్త సినిమాని రూ. 10కోట్ల కోసం వదులుకొందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.