మోహన్ బాబు కు జోడిగా మాజీ ప్రపంచ సుందరి..?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సరసన మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ నటించబోతుందా..ఇప్పుడే ఇదే వార్త కోలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా హిస్టారికల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో మోహన్ బాబు ఓ కీలక పాత్ర చేయబోతుండగా ఆయనకు భార్య గా ఐశ్వర్య రాయ్ నటించబోతుందని.. ఐశ్వర్య నందిని అనే కీలకమైన పాత్రను ఈమె చేయబోతోందని అంటున్నారు.

ఈ పాత్ర రాజ్యాధికారం మీద మక్కువతో ద్రోహానికి పాల్పడేదిగా ఉంటుందట. అంటే ఒక రకంగా ప్రతినాయిక పాత్రన్నమాట. చాలా రోజుల క్రితమే మణిరత్నం నుండి కథను విన్న ఐశ్వర్య బాగా ఆలోచించి సినిమాను ఓకే చేసినట్టు తెలుస్తోంది. వీరితో పాటు ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతిలు కూడా నటించనున్నారు. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.