‘భారతీయుడు 2’లో బాలీవుడ్ హీరో ?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. రాజకీయ పార్టీ ప్రకటించడమే కాదు. జెండా-అజెండాని ప్రకటించేశాడు. వచ్చే సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న సినిమాలని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో విశ్వరూపం2, శభాష్ నాయుడులని పూర్తి చేయనున్నారు.

మరోవైపు, శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’లో నటించనున్నాడు. రోబో ‘2.ఓ’ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ భారతీయుడు 2 ని కూడా నిర్మించనుంది. ఇప్పటికే శంకర్‌ “భారతీయుడు-2” సినిమాపై ఫోకస్ పెట్టాడు. కథను సిద్ధం చేసుకొన్నాడు. ఇటీవల తైవాన్‌లో ఇండియన్‌-2 అనే టైటిల్‌ రాసిన హీలియం బెలూన్‌ను ఎగురవేశారు. తమిళంతో పాటు ఇంగ్లీష్‌ భాషలలో ఈ టైటిల్‌ను రాశారు.

ఇప్పుడీ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారమ్. ఇప్పటికే అజయ్‌కు దర్శకుడు శంకర్ కథ చెప్పినట్టు.. దానికి ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో భారతీయుడు 2 బాలీవుడ్ లోనూ క్రేజ్ సినిమా గా మారనుంది.