అఖిల్ తో చరణ్ సినిమా..?

అక్కినేని అఖిల్ గ్రాండ్ గా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇద్దామని అనుకున్నాడు కానీ అఖిల్ ఆశ నెరవేరలేదు. మొదటి చిత్రం అఖిల్ దారుణమైన ప్లాప్ అవ్వగా , రెండో సినిమా హలో సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అనే సినిమా చేస్తున్నాడు. దీనిపైనే మనోడి ఆశలన్నీ. ఈ నేపథ్యంలో అఖిల్ కు మెగా ఆఫర్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

అఖిల్ ను హీరోగా కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయాలనీ చూస్తున్నాడట. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ను డైరెక్టర్ గా అనుకున్నాడట. ఎలాగైనా అఖిల్ తో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలనీ చరణ్ చూస్తున్నాడట. ఇప్పటికే శ్రీను కు ఈ విషయం చెప్పాడని , దానికి శ్రీను సైతం ఓకే చెప్పినట్లు సమాచారం.

ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వినయ విధేయ రామ చేస్తున్నాడు. సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి తో చిరంజీవి సినిమా చేయాల్సి ఉంది. కానీ చిరు , కొరటాల కు ఛాన్స్ ఇవ్వడం తో , అప్పటి వరకు ఖాళీగా ఉండడం ఎందుకని , అఖిల్ తో ఓ సినిమా చేయాలనీ చరణ్ చెప్పాడట. దానికి బోయపాటి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అఖిల్ కోసం ఓ యాక్షన్ కథను సిద్ధం చేస్తున్నాడట.