అందుకే నగ్నంగా నటించా.. !

హీరోయిన్ ఆకృతి సింగ్ తమిళ్ లో ఎంట్రీ సినిమా ‘ఎక్స్ వీడియోస్’లో నగ్నంగా కనిపించి ఆశ్చరపరిచిన సంగతి తెలిసిందే. అశ్లీల వెబ్ సైట్స్ యువతపై చెడు ప్రభావాన్ని చూపుతుందన్న పాయింట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఓ సన్నివేశంలో ఆకృతి నగ్నంగా కనిపించింది. ఐతే, దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయ్. తాజాగా, ఈ విమర్శలకు తనదైన శైలిల్లో సమాధానం ఇచ్చింది ఆకృతి.

ఈ సినిమా ఉద్దేశం ఒక సామాజిక సమస్యపై ప్రజలను జాగృతం చేయడమే. కొందరు సరదా కోసం ఫోన్‌లో తీసుకునే వీడియోలు ఎలాంటి అనర్ధాలకు దారితీస్తున్నాయనేది సినిమాలో చూపించారు. ఒకనటిగా పాత్రకు న్యాయం చేయడం కోసం నగ్నంగా నటించానని తెలిపింది. మరీ.. ఇప్పటికైనా ఆకృతి నగ్న ప్రదర్శనపై కామెంట్స్ కు పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.

ఇక, ఈ బెంగాలీ భామ బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. ఎక్స్ వీడియోస్ తో తమిళ్ ప్రేక్షకులకి హాట్ హీరోయిన్ గా మారింది. అక్కడ మరిన్ని సినిమాల్లో కనిపించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారమ్.