ఆలియా భట్ ‘RRR’ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్ర విశేషాలను చిత్ర యూనిట్ మీడియా తో పంచుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా , ఎన్టీఆర్ కు జోడిగా డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తున్నట్లు తెలిపారు. దాదాపు ఈ చిత్రాన్ని దానయ్య 350 నుండి 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నట్లు స్వయంగా ఆయనే తెలిపారు.

ఈ నేపథ్యంలో స్టార్ యొక్క రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో ఉంటుందనే చర్చ మొదలు అయ్యింది. చరణ్ – ఎన్టీఆర్ ఇద్దరికీ సుమారు 50 కోట్లు (రెవెన్యూ షేరింగ్ అయితే అంతకంటే డబుల్) ఇవ్వబోతున్నట్లు తెలుస్తుండగా..ఇక హీరోయిన్ అలియా రెమ్యూనరేషన్ విషయానికి వస్తే..బాలీవుడ్ లో 7-10 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటున్న ఈ భామ..ఇక ఈ సినిమా కోసం దాదాపు రూ. 15 కోట్ల వరకు తీసుకుంటుందని అంటున్నారు.

ఇక ఈ మూవీ లో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. అలాగే సముద్రఖని, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించబోతున్నారు. 2020 జులై 30 ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత దానయ్య ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేయబోతున్నారు.