అలియా రేటెంతో తెలుసా ?


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి మల్టీస్టారర్ #RRR తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. #RRRలో బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. అలియా నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిది. ఈ సినిమా కోసం అలియా ఎంత పుచ్చుకుంటుంది ? అనేది హాట్ టాపిక్ గా మారింది.

అలియా కు రూ. 5కోట్ల పారితోషికం ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. స్టార్ హోటల్లో బస, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కాకుండా ఈ మొత్తం ఇవ్వనున్నారట. సాధారణంగా తెలుగు స్టార్ హీరోయిన్స్ కి రూ. కోటి, కోటిన్నర మించి ఉండదు. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ కావడంతో.. ఆర్ ఆర్ ఆర్ కోసం అలియాకి బాగానే ఇస్తున్నారని టాక్.