అలియా అందుకే నో చెప్పిందట


ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ పేరు గట్టిగా వినిపించింది. ఆమెని తీసుకోవడం దాదాపు ఖాయమైపోయింది. రామ్ చరణ్ జంటగా అలియా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. అలియాని ఒప్పించే బాధ్యతని కరణ్ జోహార్ తీసుకోవడంతో.. ఆమె ఓకే చెప్పి ఉంటుందని అందరు భావించారు. కానీ, అలియా ఫైనల్ గా నో చెప్పినట్టు సమాచారమ్.

రాజమౌళి సినిమా అంటే అలియాకి ఆసక్తి ఉంది. పారితోషికం విషయంలోనూ పట్టింపులేమీ లేదు. కాకపోతే.. ప్రస్తుతం అలియా ఫుల్ బిజీ అట. హిందీలో వరుస సినిమాలు చేస్తోన్న అలియా.. తనకి ఖాళీ లేదని ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. ఈ మాట ఆమె సినీ గురువు కరణ్ జోహార్, దర్శకధీరుడు రాజమౌళి కి చెప్పేసిందట. దీంతో.. మరో బాలీవుడ్ హీరోయిన్ వేట లో రాజమౌళి ఉన్నట్టు సమాచారమ్.