బన్నీ బుల్లితెర బిజినెస్ ?

టాలీవుడ్ స్టార్ కేవలం సినిమాలు చేయడం మాత్రమే కాదు.. సైడ్ బిజినెస్ చేసుకొంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ ఇటీవలే మల్టీప్లెక్స్ థియేటర్స్ ని ప్రారంభించారు. మరోవైపు, నిర్మాతగా రాణిస్తున్నారు. ప్రభాస్ కూడా యూవీ క్రియేషన్స్ లో భాగస్వామి అని చెబుతుంటారు. ఆయన మహేష్ మాదిరిగా ఓ భారీ మల్టీస్టారర్ ని నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక, రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరో, నిర్మాతగానూ రాణిస్తున్నారు.

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ నుంచి గీతా ఆర్ట్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే బన్నీ అందుకు భిన్నంగా సినిమాలు కాకుంగా బుల్లితెర మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోనే టీవీ షోస్‌ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట బన్నీ.

ఇక, సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నారు. ఈ సినిమాని రాథాకృష్ణతో కలిసి అల్లు అరవింద్ నిర్మించనున్నారు. ఇందులో హీరోయిన్ గా కైరా అద్వానీ పేరు వినిపిస్తోంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.