అల్లు అర్జున్ కూడా ‘అ!’ అనిపిస్తాడట !

నేచురల్ స్టార్ నాని ‘అ !’ సినిమాతో నిర్మాత మారిన సంగతి తెలిసిందే. నిజంగా ప్రేక్షకులతో అ! అనిపించాడు. ఇప్పుడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కూడా నిర్మాతగా మారేందుకు ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారమ్. ఇప్పటికే అల్లు కుటుంబం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తుంది. అయినా.. బన్నీ తనతో ‘వేదం’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు క్రిష్ తో కలిసి ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారమ్.

ఇప్పటికే క్రిష్ తన తదుపరి సినిమా కోసం ‘అహం బ్రహ్మాస్మి’ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారు. విక్టరీ వెంకటేష్ కోసం ఈ టైటిల్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పెట్టుబడిలో తాను సగం ఇన్వెస్ట్ చేస్తానని, వచ్చిన లాభాలను సమంగా పంచుకుందామని అల్లు అర్జున్ సూచించిన‌ట్లు టాక్. దీనికి క్రిష్ కూడా ఓకే చెప్పినట్టు చెప్పుకొంటున్నారు.