విజయ్ కి భయపడిన రవితేజ…?

విజయ్ దేవరకొండ సత్తా ఎలా ఉంటుందో గీత గోవిందం తో అందరికి తెలిసిసొచ్చింది…ఇప్పుడు ఈయన పేరు చెపితే చాలు అగ్ర హీరోలు సైతం భయపడిపోతున్నారు. ఈయన తో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శక, నిర్మాతలు పోటీ పడుతుంటే , మరోపక్క ఈయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గరకు వస్తున్నాయంటే..ఈయనతో పోటీ పడేందుకు ఎవరు ముందుకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు. తాజాగా రవితేజ కూడా విజయ్ కు భయపడి ఓ అడుగు వెనక్కు వేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం విజయ్ నుండి రాబోతున్న చిత్రం నోటా. ఈ సినిమా విడుదలను అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ప్లాన్ చేసారు. దీనికంటే ముందు శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్ లో రాబోతున్న అమర్ అక్బర్ ఆంధోని సినిమాను అక్టోబర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలనీ అనుకున్నారు. కానీ ఇప్పుడు నోటా సినిమా బరిలోకి వచ్చేసరికి అమర్ అక్బర్ ఆంథోని నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అనవసరంగా ఇబ్బందులు పడడం కన్నా వెనక్కు వెళ్లడం బెటర్ అనే ఆలోచనలో వున్నట్లు సమాచారం.

సినిమా ఎలాగున్నా విజయ్ సినిమాకే ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి కాబట్టి..అమర్ ను పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో మైత్రి మూవీస్ వారు ఉన్నట్లు వినికిడి.