అమీజాక్సన్’కి నిరాశే.. !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’లో అమీజాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత శంకర్ ‘ఐ’ సినిమా ఛాన్స్ కొట్టేసి లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. ఐ అట్టర్ ప్లాప్ కావడంతో అమీ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. ఐతే, ఆ సినిమా కోసం అమీ పడిన కష్టం మాత్రం వృధా కాలేడు. ఆమె నటన మెచ్చిన శంకర్ 2.ఓ కోసం తీసుకొన్నారు.

ఇందులో అమీ లేడీ రోబోగా కనిపించింది. ఆమె పాత్రకి పెద్దగా నటించే స్కోప్ లేదు. కథ మొత్తం రజనీ, అక్షయ్ పాత్రల చూట్టూనే తిరుగుతుటుంది. ఇంటర్నెట్‌ని వేడెక్కించే రీతిలో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసే ఏమీ ఇందులో రోబో డ్రస్సులేసుకుని కనిపించడం ఆమె అభిమానులని నిరాశ పరుస్తోంది. ఈ సినిమా తర్వాత బిజీ అయిపోతానని భావించిన అమీ ఆశలు కూడా ఫలించలేదు.

ఏడాది క్రితమే 2.0లో అమీ పాత్ర షూటింగ్ అయిపోవటంతో ఇంగ్లాండ్ కె పరిమితం అయ్యింది, ఈ గ్యాప్ లో కూడా ఆమెకి ఒక్క అవకాశం కూడా రాలేదు. సినిమా విడుదల తర్వాతైనా.. అమీని సంప్రదించేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో 2.ఓ అమీకి ఆమె అభిమానులకి తీవ్ర నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.