ఎన్టీఆర్ తో మజ్ను ??

anuemmanuel

త్రివిక్రమ్ కు ఓ అలవాటు వుంది. తన సినిమాలో రిపీట్ ఆర్టిస్టులు కనిపిస్తుంటారు. తనకు ఎవరైన నచ్చితే మళ్ళీ మళ్ళీ వారితోనే పాత్రలు వేయిస్తుంటారు. సమంత.. ఏకంగా మూడు సినిమాలు తీసేశారు త్రివిక్రమ్. ఇప్పుడు మరో హీరోయిన్ ను ఇలానే రిపీట్ చేస్తున్నారు. ‘మజ్ను’ .. ‘కిట్టు వున్నాడు జాగ్రత్త’ చిత్రాలతో ఆకట్టుకున్న అనూ ఇమ్మాన్యుయేల్, ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ఆమె నటిస్తోంది.

ఇప్పుడు మరోసారి ఆమెకు ఓ ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్‌ ఎన్టీఆర్ కళాయిలో ఓ సినిమా రూపొందనుంది. అందుకోసం ఆయన ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా అను ఇమ్మాన్యుయెల్‌ని ఎంపికచేసుకున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.