సైరా లో దేవసేన..?

మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహరెడ్డి. ఉయ్యాలా వాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దికుంటున్న ఈ మూవీ లో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా , తమన్నా , బిగ్ బి , జగపతి బాబు , సుదీప్ , విజయ్ సేతుపతి మొదలగు స్టార్ నటి నటులు వివిధ పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ లో ఓ కీలక పాత్ర కోసం దేవసేన అనుష్క ను తీసుకున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో హల్చల్ చేస్తుంది.

స్వయంగా రంగంలోకి దిగిన రామ్ చరణ్ అనుష్క తో సంప్రదింపులు జరిపి ఆమెను ఒప్పించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ వార్త బయటకు రావడం తో సోషల్ మీడియా లో అంత ఈ వార్త గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. గతంలో స్టాలిన్ సినిమాలో చిరు తో ఓ సాంగ్ లో చెందులేసిన అనుష్క..ఇప్పటివరకు చిరు తో జోడి కట్టే ఛాన్స్ మాత్రం దక్కించుకోలేకపోయింది. మరి ఈసారైనా జోడి కడుతుందా లేదా అనేది చూడాలి.