మరో రెండు రోజుల్లో అరవింద ట్రైలర్..?

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వం లో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా , హీరో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని , హైదరాబాద్ లో పాటల చిత్రీకరణలో బిజీ గా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చి అభిమానులను సంబరాలకు గురిచేస్తుంది.

సెప్టెంబర్ 13 న వినాయక చవితి సందర్భాంగా అరవింద సమేత ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారట. ఆ మరోసాటి రోజునుండి ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ వార్త బయటకు రావడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే హరికృష్ణ మరణంతో షాక్ లో ఉన్న అభిమానులు మళ్లీ అరవింద వార్తలతో హరికృష్ణ మరణాన్ని మరచిపోతున్నారు.

ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు , జగపతి బాబు ప్రధాన పాత్రల్లో కనిపిస్తుండగా , ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసారు.