అర్జున్ అరెస్ట్ వాయిదా

యాక్షన్ కింగ్ అర్జున్ అరెస్ట్ వాయిదా పడింది. యాక్షన్ కింగ్ అర్జున్ పై నటి శ్రుతి హరిహరన్ లైంగిక వేధింపుల కేసు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అర్జున్ పై కబ్బన్‌ పార్కు పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీన్ని రద్దు చేయాల్సిందిగా అర్జున్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై శ్రుతి హరిహరన్ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

తాజాగా, ఈ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణని డిసెంబర్‌ 11కు వాయిదా వేసింది. అప్పుటి వరకు అర్జున్‌సర్జాపై ఏలాంటి చర్యలు తీసుకోరాదని పోలీసులకు సూచించింది. ఈ నేపథ్యంలో అర్జున్ అరెస్టు వాయిదా పడినట్టేనని చెప్పవచ్చు. తమిళ్, కన్నడ ద్విభాషా చిత్రం ‘నిబుణన్‌’ (కన్నడలో ‘విస్మయ’) సెట్స్‌లో నాతో అసభ్యంగా ప్రవర్తించారు. ఒక పాట సన్నివేశంలో అర్జున్‌ నన్ను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా నన్ను తడిమారని ఆరోపించిన సంగతి తెలిసిందే.