మలైకా మెడలో అదే మంగళ సూత్రం

బాలీవుడ్ లో అర్జున్‌ కపూర్ – మలైకా అరోరాల బంధం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొన్న ఆంటీ మలైకాతో అర్జున్ కపూర్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ప్రేమ, పెళ్లి గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. అర్జున్‌ కపూర్‌ మాత్రం నేను సింగిల్‌గా లేను అని ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇప్పుడు మలైకా కూడా ఈ విషయంలో హింట్ ఇచ్చింది.

ఆమె మెడలో ఓ లాకెట్‌ మెరుస్తోంది. ‘ఎఎమ్’ అనే అక్షరాలతో ఉన్న లాకెట్ అది. ఇక్కడ ఎ – అర్జున్ కపూర్, ఎమ్ – మలైకా అన్నమాట. ఇప్పుడీ లాకెట్ నే మంగళసూత్రంగా భావించి.. వీరిద్దరు సంసారం చేస్తున్నారని బాలీవుడ్ సమాచారమ్. ఇక, మలైకా అర్జున్ కంటే 10యేళ్లు పెద్దది. చాన్నాళ్ల నుంచే కుర్రాడు అర్జున్ కపూర్ తో యవ్వారం నడిపిస్తున్నట్టు టాక్. ఇప్పుడు ఏకంగా అర్జున్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారమ్.