బ్యాడ్ న్యూస్ : అభిమానులకి బాలయ్య దూరం

01-1501594354-balakrishna-paisa-vasool-641

నందమూరి అభిమానులకి బ్యాడ్ న్యూస్. ఇకపై అభిమానులకి బాలకృష్ణ కాస్త దూరం కానున్నాడు. ఇటీవలకాలంలో అభిమానులపై బాలయ్య చేయి చేసుకొన్న ఘటనలు హాట్ టాపిక్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇది పర్సనల్’గా, పొలిటికల్’గానూ బాలయ్యకు చేటు చేస్తుంది. ఇదే విషయాన్ని సన్నిహితులు, మిత్రులు బాలయ్యకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. ఇకపై బౌన్సర్లను నియమించుకోవాలని సూచించారట. ఇప్పుడా సూచనని బాలయ్య పాటించబోతున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి బాలయ్యకు బౌన్సర్లు ఉందరు. అభిమానులకు దగ్గరగా ఉండటం నాకు ఇష్టం. బౌన్సర్ల ఉంటే అది వీలుకాదు. అందుకే చాన్నాళ్లుగా బౌన్సర్లని నియమించుకోవడం లేదు. అయితే, ఈ మధ్య జరిగిన ఒకట్రెండు ఘటనల నేపథ్యంలో బౌన్సర్లని నియమించుకోవడం తప్పడం లేదని బాలయ్య చెబుతున్నాడు. ఇకపై అభిమానులకి కాస్త దూరంగా ఉండటం బాధని కలిగించే విషయని.. అయినా తప్పదని బాలయ్య చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం బాలయ్య కెయస్. రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.