అంబికా బాంబ్ : బాలయ్య, జూ. ఎన్టీఆర్ సంబంధాలున్నాయ్

ntr-balayya

బాబాయ్ – అబ్బాయ్ నందమూరి బాలకృష్ణ, జూ. ఎన్ టీఆర్’లు బహిరంగంగా ప్రేమగా ఉన్నా.. వారి మధ్య వివాదాలున్నాయనే ప్రచారం ఉంది. అయితే, వీరి మధ్య ఉన్న సంబంధాలపై మాట్లాడే సాహాసం ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఫస్ట్ టైం బాబాయ్-అబ్బాయ్ సంబంధాలపై టీడీపీ సినీయర్ నేత అంబికా కృష్ణ నోరు తెరిచారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంబికా కృష్ణ మాట్లాడుతూ.. బాలయ్య, జూ. ఎన్టీఆర్ ల మధ్య సంబంధాలున్నాయి. కానీ, మంచి సంబంధాలు ఉన్నాయా ? లేదా.. ?? అన్నది మాత్రం తెలీదన్నారు.

బాబాయ్-అబ్బాయ్ లు ఆప్యాయంగా ఉంటారా ? లేదా.. ?? విషయాన్ని తెలుసుకోవాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఆ విషయాన్ని అంబికా కృష్ణ కూడా సగం సమాధానం చెప్పి ఆపేయడంతో.. నందమూరి అభిమానుల్లో బాబాయ్-అబ్బాయ్ ల అనుబంధం ప్రశ్నగా మిగిలిపోయేలా ఉంది. అయితే, బాబాయ్య సినిమా రిలీజైనప్పుడల్లా.. తారక్, కళ్యాణ్ రామ్ లు బాబాయ్ సూపర్ అని కితాబిస్తుంటారు. ఈ లెక్కన బాబాయ్ పై అబ్బాయిలకి సాఫ్ట్ కార్నర్ నే ఉన్నట్టుంది. మరీ.. బాబాయ్ కి అబ్బాయిలపై ఎలాంటి ప్రేమ ఉందో అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.