బాలయ్య 102 మూవీ టైటిల్ అదేనా..?

balakrishna_102movie1

నందమూరి బాలకృష్ణ మాములు స్పీడ్ గా లేడు..ఏజ్ తో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఓ సినిమా పూర్తి అయేలోపు మరో సినిమా మొదలు పెడుతూ అభిమానుల్లో సంబరాలు నింపుతున్నాడు. ఇటీవలే పైసా వసూల్ మూవీతో హిట్ కొట్టిన బాలయ్య , ప్రస్తుతం తన 102వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చిత్రం తాలూకు రెండు షెడ్యూళ్లు పూర్తి చేసింది. పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ఫై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

01-1501594354-balakrishna-paisa-vasool-641
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘కర్ణ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ప్రస్తావనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఫిలిం సర్కిల్లో మాత్రం ఈ టైటిల్ బాగా చక్కర్లు కొడుతుంది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార ప్రధాన కథానాయకిగా నటిస్తుండగా మలయాళ హీరోయిన్ నటాషా దోషి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతి బరిలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.