బాలయ్య నిర్ణయం కోసం వెయిటింగ్..

భద్ర..తులసి..సింహ…లెజెండ్…సర్రాయినోడు ఇలా యాక్షన్ చిత్రాలతో బోయపాటి ఎంతో పేరు తెచ్చుకున్నారు. వినయ విధేయ రామ చిత్రం ముందువరకు కూడా బోయపాటి ని అగ్ర దర్శకుడి కింద లెక్కేసేవారు. కానీ వినయ విధేయ రామ చిత్రం తర్వాత బోయపాటి అంటే భయపడే రోజులు వచ్చాయి. అంత దారుణంగా ఆ సినిమా తెరకెక్కించి తనకున్న పేరును పోగొట్టుకున్నాడు. మొన్నటి వరకు బోయపాటి తో ఎవరు కూడా సినిమాలు నిర్మించేందుకు ముందుకు రాలేదు. కానీ తాజాగా ఓ నిర్మాత మాత్రం ఓ సినిమా చేయాలనీ వెంటపడుతున్నాడట.

మాంచి పాపులర్ హీరో డేట్స్ పట్టుకున్న బోయపాటి దగ్గరకు వచ్చాడట. కానీ బోయపాటి మాత్రం ఇంకా ఊ అనడం లేదు. కారణం ఒక్కటే, బాలయ్య బంధం నుంచి స్మూత్ గా ఎలా బయటకు రావాలన్నది. బాలకృష్ణతో సినిమా చేయాలని బోయపాటికి బలంగా వుంది. కానీ ప్రస్తుతం మాత్రం బాలయ్య రవికుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తారని అంటున్నారు. బాలయ్య దగ్గర కు బోయపాటి వెళ్లి బయటకు సినిమా గురించి చెప్పి..ఆయన దగ్గరి నుండి అనుమతి తీసుకొని రావాలని చూస్తున్నాడట. ఆయన ఒకే అంటే సదరు నిర్మాత కు ఓకే చెప్పాలని చూస్తున్నాడట. మరి బాలయ్య ఏం అంటాడో చూడాలి.