వర్మ ‘ఎన్టీఆర్’ బాలయ్య కాదట

balayya

మహానటుడు ఎన్టీఆర్‌ జీవిత చరిత్రతో సినిమాపై ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని తీసుకురానున్నట్టు ప్రకటించేశారు. ఆ తర్వాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నందుకు గర్వపడుతూ ఓ ప్రకటనని రిలీజ్ చేశారు. అయితే, ఎవరు ఎన్టీఆర్ బయోపిక్ తీసిన అందులో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తీయబోయే ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో బాలయ్య నటించబోతున్నట్టు చెప్పుకొన్నారు. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించాలనుకొంటున్న సినిమాలో బాలకృష్ణ నటించేందుకు సుముఖంగా లేనట్టు తెలిసింది. మరి.. వర్మ ఎన్టీఆర్ బయోపిక్ లో హీరోగా ఎవరు నటిస్తారు.. ? అలాగే బాలయ్య తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడు ఎవరు ?? అనేది ఆసక్తిగా మారింది.