రామ్, నితిన్ రిజక్ట్ చేసిన కథతో బెల్లకొండ

‘ఆర్ఎక్స్100’ సినిమాతో ప్రతిభ ఉన్న దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకొన్నారు అజయ్ భూపతి. ఐతే, ఈ దర్శకుడు తన రెండో సినిమా కోసం చాలా మంది హీరోల చుట్టూ తిరిగినట్టు తెలుస్తోంది. ఫైనల్ గా బెల్లకొండ శ్రీనివాస్ తో అజయ్ భూపతి సినిమా ఫిక్సయింది. బెల్లకొండ కంటే ముందు ఈ కథని యంగ్ హీరోలు రామ్, నితిన్ లకి వినిపించాడట. వారిద్దరి కూడా ఇది తమకు సూటయ్యే కథ కాదని చెప్పారంట. బెల్లకొండ మాత్రం ధైర్ఘ్యం చేసి ఒప్పేసుకొన్నాడట.

ప్రస్తుతం బెల్లకొండ తేజ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘సీత’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బెల్లకొండ-కాజల్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రమేశ్ వర్మ దర్శకత్వం ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ తర్వాత అజయ్ భూపతి సినిమాని మొదలెట్టనున్నారు. మరీ.. రామ్, నితిన్ రిజెక్ట్ చేసిన కథతో బెల్లకొండ హిట్ కొడతాడేమో చూడాలి.