బిచ్చగాడు హీరోయిన్ విడాకుల ప్రచారం.. నిజమా ?

బిచ్చగాడు హీరోయిన్ సాట్నా టైటస్ పెళ్లి పెటాకులు కాబోతుందా ? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గత ఏడాది జనవరిలో డిస్ట్రిబ్యూటర్ కార్తిని పెళ్లి చేసుకుంది. పెద్దల్ని ఎదిరించి మరీ వీరు పెళ్లి చేసుకొన్నారు.పెళ్లయి రెండేళ్లు కూడా తిరక్కుండానే వీళ్ల మధ్య విబేధాలు తలెత్తినట్టు సమాచారమ్. ప్రస్తుతం వీరిద్దరు విడి విడిగా ఉంటున్నారని తెలిసింది.

బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది సాట్నా. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘నీది నాది ఒకే కథ’ సినిమాలోనూ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలేవీ చేయడం లేదు. తమిళ్ లో మాత్రం ఓ సినిమా చేస్తోంది. ఇక, కోలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకొన్న అమలాపాల్, ఏఎల్ విజయ్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాట్నా-కార్తీ లు ఇదే దారిలోనే నడిచేలా కనబడుతున్నారు.