బాలయ్యను కాదని చిరుకి ఓకే

Chiru-bigb

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది. ర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మొదటి నుంచి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ని టైటిల్‌గా అనుకుంటున్నప్పటికీ ‘సైరా నరసింహారెడ్డి’ని చివరికి చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ సందర్భంగా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించే వారు, సాంకేతిక నిపుణుల జాబితాను కూడా ప్రకటించారు.

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌,జగపతిబాబు, నయనతార, తమిళ హీరో విజయ్‌ సేతుపతి, కన్నడ నటుడు సుదీప్‌ ప్రధాన పాత్రధారులు. రవి వర్మన్‌ సినిమాటోగ్రఫీ. ఎ.ఆర్‌. రెహమాన్‌ మ్యూజిక్. కాగా ఈ సినిమాలో బిగ్ బి పేరు అధికారికంగా ప్రకటించడం ఒక్కింత ఆసక్తికలిగించిన విషయం. వాస్తవానికి బిగ్ బి ని మొదట బాలయ్య సినిమా కోసం ఒకసారి సంప్రదించారు. కానీ ఎందుకు ఆయన ఓకే చెప్పలేదు. కానీ ఇప్పుడు మెగా సినిమాలో ఆయన మెరవడం చర్చనీయంశమైయింది.