బాలయ్యపై భయంకరమైన ప్రచారం

balakrishna_102movie2

నందమూరి బాలకృష్ణపై భయంకరమైన ప్రచారం జరుగుతోంది. అది కాస్త ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితం కావడంతో బాలయ్య ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల కాలంలో ఒకట్రెండు సార్లు బాలయ్య అసిస్టెంటులపై చేయి చేసుకొన్న విషయం తెలిసిందే. దీనిపై ఓ ఇంటర్వ్యూలో స్వయంగా స్పందించడం.. వివరణ ఇవ్వడం కూడా జరిగిపోయింది.

అయితే, సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బాలయ్య 102 సినిమా షూటింగ్ సమయంలోనూ బాలయ్య తన అసిస్టెంటుపై చేయి చేసుకోవడం.. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో.. బాలయ్యకు అసిస్టెంటుగా పనిచేసిందుకు ఎవ్వరు ముందుకు రావడం లేదు. అవసరమైతే.. జాబ్ మానేస్తాం. కానీ బాలయ్యకు అసిస్టెంటుగా ఉండలేమని సిబ్బంది చెబుతున్నట్టుగా ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది.

ఈ కథనంపై చిత్ర దర్శక-నిర్మాతలు కె.యస్ రవికుమార్, సికె కళ్యాణ్ స్పందించారు. బాలయ్య వల్ల తమకు ఏ బాధలేదని క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్ సరదా సరదాగా సాగుతుందని తెలిపారు. మరీ.. ఇప్పటికైనా బాలయ్యపై జరుగుతున్న భయంకరమైన ప్రచారానికి పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.