బాలయ్య అభిమానులని నిరాశపరిచిన బోయపాటి !

‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను పేరు చెబితేనే అభిమానులు భయపడిపోతున్నారు. బోయపాటి దర్శకత్వంలో సినిమా వద్దంటూ.. మహేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద క్యాంపైనింగ్ నే చేశారు. బోయపాటి తదుపరి సినిమా బాలయ్యతో అని తెలిసిన నందమూరి అభిమానులు కూడా జక్కారు. ఐతే, బాలయ్య-బోయపాటిది హిట్ కంబో. వీరి కలయికలో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలయ్యతో సినిమా అంటే బోయపాటికి పూనకం వస్తుంటుంది. బాలయ్య కోసం మంచి కథని రెడీ చేస్తాడనే నమ్మకంతో నందమూరి అభిమానులు ఉన్నారు.

అందుకు తగ్గట్టుగానే బోయపాటి.. బాలయ్యని ముఖ్యమంత్రి చేయబోతున్నట్టు వార్తలొచ్చాయ్. ఈ న్యూస్ విని బాలయ్య అభిమానులు సంతోషపడ్డారు. ఐతే, ఇప్పుడు బాలయ్య సీఎం అనే న్యూస్ అబద్దమని తేలింది. ఎలక్షన్స్ కి ముందు విడుద‌ల‌య్యేలా బాలయ్యతో ఒక పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలని బోయపాటి భావించారట. ఆ కథలో బాలయ్య సీఎం పాత్రలో కనిపిస్తారట. ఐతే, ఇప్పుడీ కథని తెరకెక్కించడం లేదట. బాలయ్య సినిమా ఎన్నిక‌లు మొత్తం ముగిసిన త‌ర్వాతే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో.. సింహా తరహా యాక్షన్ ఎంటర్ టైనర్ తీయబోతున్నట్టు బోయపాటి క్లారిటీ ఇచ్చారు.