‘ఛలో’ దర్శకుడికి బంపర్ ఆఫర్

Director Venky Kudumula @ Chalo Movie Press Meet Stills

వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య-రష్మిక మందన జంటగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన “ఛలో” సినిమాని సూపర్ హిట్ గా తేల్చారు ప్రేక్షకులు. యాక్షన్ కామెడీతో కూడిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఛలో’కు యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారు. ఫలితంగా చిన్న సినిమాగా వచ్చిన ‘ఛలో’ పెద్ద విజయం వైపు అడుగులు వేస్తుంది.

ఈ కొత్త దర్శకుడు వెంకీ కడుముల ఎవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శిశ్యుడే. ఇప్పుడు త్రివిక్రమ్ సొంత బ్యానర్ గా పిలవబడే ‘హారిక అండ్ హాసిని’ బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు అవకాశం కొట్టేశాడు. వెంకీ వినిపించిన కథని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఓకే చేసింది. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో వెంకీ ఉన్నాడు. ఈ బ్యానర్ లో త్రివిక్రమ్-ఎన్ టీఆర్ ల సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఈ బ్యానర్ లో వెంకీ సినిమా ఉండనుందని చెప్పుకొంటున్నారు.