బన్నీ మూవీ కి మళ్లీ బ్రేక్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పడం లేదు. గత రెండేళ్లుగా హిట్ లేని బన్నీ..ఓ హిట్ కొడితే చూడాలని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ వారి కోరిక మాత్రం ఇప్పట్లో తీరలేదు..నా పేరు సూర్య సినిమా విడుదలై ఆరు నెలలు కావొస్తున్నా ఇంత వరకు బన్నీ కొత్త సినిమా ప్రకటన చేయలేదు. విక్రమ్ తో సినిమా దాదాపు ఫిక్స్ అయినట్లే అని ప్రచారం జరిగిన చివరికి వచ్చే సరికి విక్రమ్ కు హ్యాండ్ ఇచ్చాడు.

అరవింద సమేత తో హిట్ కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో బన్నీ ఓ సినిమా చేయాలనీ భావించాడు. ఈ నెలలో ఈ సినిమా మొదలు కాబోతుందని నిన్నటి వరకు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. ముందుగా ఒక హిందీ రీమేక్ అనుకున్నారు కానీ రీమేక్ ఎందుకని భావించిన త్రివిక్రమ్ ఓ కథ సిద్ధం చేసి బన్నీ , అల్లు అరవింద్ లకు వినిపించాడట. కానీ ఆ కథ కు వారు కన్విన్స్ చేయలేకపోయిందట. కొన్ని మార్పులు చేసి మళ్లీ వినిపించమని కోరారట. దాంతో మళ్లీ కథ ఫై కుర్చున్నాడట త్రివిక్రమ్. ఇక మళ్లీ బన్నీ కి ఎదురుచూపులు మొదలు అయ్యాయి. త్రివిక్రమ్ కథ రాసుకొని , మళ్లీ వారికీ వినిపించి ఓకే చేయించేసరికి ఇంకాస్త సమయం పడుతుంది. సో ఇప్పట్లో బన్నీ సినిమా లేదని స్పష్టంగా అర్ధం అవుతుంది.