బన్నీ తో సామ్ రొమాన్స్..?

ఈ ఏడాది రంగస్థలం , అభిమన్యుడు, మహానటి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సమంత..ప్రస్తుతం యు టర్న్ మూవీ తో వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషల్లో ఏకకాలం లో విడుదల కాబోతుంది. ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ అమ్మ‌డు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని ఫిలిం సర్కిల్లో వార్త చక్కర్లు కొడుతుంది. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం త‌ర్వాత బ‌న్నీ ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌ని అందరూ ఎదురుచూస్తుండగా మ‌నం, 24 వంటి అద్భుత చిత్రాలు తెర‌కెక్కించిన విక్ర‌మ్ కుమార్ డైరెక్ష‌న్‌లో చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఎంతో ప్ర‌తిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత అయితే బాగుంటుందని డైరెక్టర్ ఫిక్స్ అయినట్లు అంటున్నారు. గతంలో స‌మంత ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో అల్లు అర్జున్‌ సరసన నటించింది.

ఈ సినిమాలో వీరిద్దరి పెయిర్ అభిమానులను , ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరి జోడి బాగుంటుందని అంత అంటున్నారు. మరి నిజంగానే బన్నీ సరసన జోడి కడుతుందా లేదా అనేది ఆమెనే తెలపాలి.