విజయ్ కోసం హ్యాట్ బ్యూటీ


టాలీవుడ్ యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. గత యేడాది గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొన్నారు. ఈ యేడాది విజయ్ నుంచి తొలి చిత్రం డియర్ కామ్రెడ్ రాబోతుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. విజయ్ కి జంటగా రస్మిక నటిస్తోంది.

ఈ సినిమా తరువాత క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తరహా.. ఓ వైధ్యమైన ప్రేమకథని తెరకెక్కించనున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ ని తీసుకొన్నట్టు సమాచారమ్. ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు నిర్మించనున్నారు. హాట్ హాట్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్ కి సరిగ్గా సూటయ్యే కేథరిన్ విజయ్ లవ్ స్టోరీకి తీసుకోవడం ఆశ్చార్యాన్ని కలిగించే విషయమే.