చరణ్ మౌనానికి కారణం అదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ అయినా సంగతి తెలిసిందే. ఏ విషయాన్నయినా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో గాయపడి రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం గాయం తగ్గిపోయిందని తెలుస్తుంది. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఏ విషయాలు షేర్ చేయకపోవడం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సడెన్ గా చరణ్ ఎందుకు సైలెంట్ అయ్యాడు..సినిమాకు సంబదించిన విషయాలే కాదు మారే ఏ విషయాలు షేర్ చేసుకోవడం లేదేంటి అని మాట్లాడుకుంటున్నారు. అయితే చరణ్ సైలెంట్ కు కారణం ఆయన ఇటీవలే మాల వేసుకున్నాడు. అందుకే ఆయన మౌనం గా ఉన్నారని మెగా సన్నిహితులు చెపుతున్నారు. మొన్న కన్నడ రాజ్ కుమార్ ఫ్యామిలీ వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడే చరణ్ మాలలో ఉన్న విషయం బయటపడింది. ప్రతి ఏడాది చరణ్ మాల వేసుకోవడం సాధారణ విషయమే. ఈ మాల కారణంగానే మౌనం గా ఉన్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.