Ram Charan and Sukumar's film under Mythri Movie

‘మొగల్తూరు మొనగాడు’ ముందుకు రాలేదు. చరణ్ – సుకుమార్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ‘మొగల్తూరు మొనగాడు’ టైటిల్ ప్రచారంలో ఉంది. రేపల్లె, పల్లె ప్రేమలు, పల్లెటూరు మొనగాడు, మొగల్తూరు మొనగాడు టైటిల్స్ పరిశీలనలో ఉన్నా.. వీటిలో మొగల్తూరు మొనగాడు ఫైనల్ అయినట్టు చెబుతున్నారు.

ఈ చిత్రం బుధవారం (ఫిబ్రవరి 15) నుంచి సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇందుకు కారణలేంటీ.. ? అంటే.. పెల్లెటూరు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఏపీలో గోదావరి జిల్లాల్లో ప్లాన్ చేశాడు సుకుమార్. గోదావరి జిల్లాల్లోని పల్లెటూరులు తిరిగి లోకేషన్స్ ని ఫైనల్ చేశాడు. తీరా షూటింగ్ అనుమతి కోసం పోలీసులని ఆశ్రయిస్తే.. వారు షాక్ ఇచ్చారు. చరణ్ లాంటి స్టార్ హీరోకి సెక్యూరిటీ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో.. పొరుగు రాష్ట్రాల్లో లొకేషన్స్ ని వెతికే పనిలో పడింది చిత్రబృందం.

ఈ కారణంగానే మొనగాడు ముందుకు రాలేదని తెలుస్తోంది. అయితే, ఫస్ట్ షెడ్యూల్ కేరళలో ప్లాన్ చేశారు. అక్కడ ఫైట్ సీన్స్ ని చిత్రీకరించనున్నారు. లొకేషన్స్ వేట ముగియకపోవడం కేరళ షెడ్యూల్ ని కూడా క్యాన్సిల్ చేశారు.

ఈ చిత్రంలో చరణ్ చెవిడివాడిగా కనిపించబోతున్నాడు. చరణ్ సరసన శృతిహాసన్ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.

లేటెస్ట్ గాసిప్స్