ఛార్మి స్వీట్ హగ్..నభా నటేష్ కు ఎక్కడో కాలిందా..?

మే 15 న ఎనర్జిటిక్ హీరో రామ్ పుట్టిన రోజు…ఈ సందర్భాంగా ఆయనపుట్టిన రోజు వేడుకలు ఇస్మార్ట్ శంకర్ సెట్ లో జరిగాయి..ఆ వేడుకల్లో ఛార్మి …రామ్ కు స్వీట్ హగ్ ఇవ్వడం నాభా కు ఎక్కడో కాలిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రామ్ – నిధి అగర్వాల్ , నభా నటేష్ జంటగా పూరి డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ చిత్రం తెరకెక్కుతుంది. పూరి – ఛార్మి లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర చివరి షెడ్యూల్ గోవా లో జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో రామ్ యూనిట్ సభ్యుల మధ్య కేక్‌ను కట్ చేశారు.

సెట్స్‌లో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో దర్శకుడు పూరి జగన్నాథ్, సహ నిర్మాత ఛార్మి, హీరోయిన్ నభా నటేష్‌తో పాటు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రామ్‌కు పూరి జగన్నాథ్, నభా నటేష్ కేక్ తినిపిస్తే.. ఛార్మి మాత్రం స్వీట్ హగ్‌తో విషెస్ చెప్పారు. పక్కనే ఉన్న నాభ..ఛార్మి హగ్ ఇచ్చే సరికి షాక్ అయ్యిందని..ఆ పని నేను ఎందుకు చేయలేకపోయానని అనుకుందని అంటున్నారు.

ఈ చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ ఇప్పటికే పూర్తియనట్టు దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో వెల్లడించారు. ఇంకా నాలుగు పాటల చిత్రీకరణ మాత్రం మిగిలి ఉందని చెప్పారు. ప్రస్తుతం గోవాలో రామ్, నభా నటేష్‌పై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.