Chiranjeevi Khaidi No 150 Beats Bahubali Records
9యేళ్ల తర్వాత అసలుసిసలైన మెగా హంగామా మళ్లీ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అభిమానుల నిరాజనాలు అందుకొంటోంది. మెగాస్టార్ క్రేజ్ కి రికార్డులు బద్దలవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది.

మెగా ఖైదీ ‘యుఎస్’ కలెక్షన్స్ 1మిలియన్ క్రాస్ అయ్యాయి. కేవలం యుఎస్ ప్రీమియర్ షోస్ ద్వారానే 1+మిలియన్ వసూళ్లు రాబట్టింది. బాహుబలి యుఎస్ ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చిన మొత్తం 1.36మిలియన్. ఇప్పుడు మెగాఖైదీ దాదాపు బాహుబలి వసూళ్లని రీచ్ అయ్యింది.

ఇక, మెగాస్టార్ ప్రభావం ఎక్కువగా ఉండే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితేంటి.. ? ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి నెలకొల్పిన పలు రికార్డులని మెగా ఖైదీ కొల్లగొడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేడు. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్, ఏరియా వారీగా కలెక్షన్స్ లో బాహుబలి వసూళ్లని ఖైదీ నెం.150 బీట్ చేయడం ఖాయం. అసలే పండగ పూట.. ఆపై మెగాస్టార్ 9యేళ్ల ఆకలి.. మెగా అభిమానులు పులుల్లా గర్జిస్తున్నారు. ఇంకేముంది బాహుబలి రికార్డ్స్ లో కొన్ని బద్దలు అవ్వడ ఖాయం అంటున్నారు. మరీ.. ఏమైవుతుందో చూడాలి.

లేటెస్ట్ గాసిప్స్