khaidi
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’. ఈ సంక్రాంతి కానుకగా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఇప్పటికే మెగా ఖైదీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరోవైపు, మెగా ఖైదీపై నెగటివ్ ప్రచారం కూడా జోరందుకొంది. మెగా ఖైదీపై చిరు పెద్దగా నమ్మకంగ లేడట. దీంతో.. ఓ వైపు పాజిటివ్ టాక్, మరోవైపు నెగటివ్ టాక్ ల మధ్య మెగా అభిమానులు ఊగిస‌లాడుతున్నారు.

పైకి ఆహో.. ఓహో అంటున్న 150సినిమాలు చేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల పల్స్ స్పష్టంగా తెలుసు. అందుకే కత్తెరపట్టి సిజరింగ్ చేసేశాడని చెబుతున్నారు. స్వయంగా చిరు కట్ చేసిన సన్నివేశాలు ఏంటన్నది ఓ సారి చూద్దాం. మెగా ఖైదీలో అనవసరంగా అనిపించిన కామెడీ సీన్స్ అన్నింటికీ కత్తెర వేశారట చిరు. వీటిలో 30 ఇయర్స్ పృధ్వీ సీన్స్ అధికంగ ఉన్నట్టు చెబుతున్నారు.

ఇక, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి పంచ్ లు బాగా పేలాయట. దీంతో.. మెగాస్టార్ వాటిని అలాగే ఉంచినట్టు తెలుస్తోంది. సినిమాలో చిరు ఎంట్రీ, యాక్షన్ సీన్స్, పాటలు అద్భుతంగా వచ్చాయని స్వయంగా చిరునే తెలిపినట్టు తెలుస్తొంది. చిరు ఫైనల్ సిజరింగ్ తర్వాత మెగా ఖైదీ ఓ షేపుకి వచ్చినట్టు చెబుతున్నారు.

లేటెస్ట్ గాసిప్స్