allu arjun

‘ఎవడు’ చిత్రంలో అల్లు అర్జున్‌ రామ్‌చరణ్‌ కలసి కనిపించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కనిపించింది కొంచెం సేపే అయనా సినిమా మొత్తం అల్లు అర్జున్ వున్న ఫీలింగ్ కలుగుతుంది. అంత చక్కటి అతిధి పాత్ర అది. అయితే ఇప్పుడు మరోసారి ఇద్దరని ఒకే సినిమాలో చూసే అవకాశం వుందని టాక్ వినిపిస్తుంది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్‌ అతిథి పాత్రలో మెరవనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం వూటీలో జరుగుతోంది. ఈ చిత్రంలో అర్జున్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. 2018 ఏప్రిల్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Latest News