దిల్ రాజుపై మహేష్’కు ఫిర్యాదు


సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’. వంశీపైడిపల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు – పివిపి -అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరి కలయిక విచిత్రంగా జరిగింది. వాస్తవానికి ‘మహర్షి’ సినిమా దిల్‌ రాజు బ్యానర్ లో కన్‌ఫర్మ్‌ అయింది. ఐతే, ‘ఊపిరి’ తర్వాత వంశీపైడిపల్లి పివిపి బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఇక, మహేష్‌ ఎప్పుడో అశ్వనీదత్‌కి కమిట్ అయి ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని కలిపాడు మహేష్. ఐతే, మహర్షి నిర్మాణంలో దిల్ రాజు హుషారు చూపిస్తున్నాడట.

బిజినెస్‌ వ్యవహారాలతో పాటు మీడియా కవరేజ్‌లో ‘మహర్షి’ తన సినిమాగా ప్రొజెక్ట్‌ చేసుకుంటున్నాడట దిల్‌ రాజు. దీనిపై మిగిలిన ఇద్దరు నిర్మాతలు మహేష్ కు ఫిర్యాదు చేసినట్టు సమాచారమ్. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కారణంగా బిజినెస్‌ వ్యవహారాలు కూడా ఆలస్యం అవుతున్నాయట. ఏప్రిల్‌ 5న విడుదల చేయాలని ప్లాన్‌ చేసిన ఈ చిత్రం ఏప్రిల్‌ 25కి వెళ్లడం కూడా ప్లానింగ్‌ పరంగా జరిగిన లోపాల కారణంగానేనని చెప్పుకొంటున్నారు. సమ్మర్‌ని క్యాష్‌ చేసుకోవడానికి వున్న మంచి అవకాశాన్ని మిస్‌ చేసుకొన్నారు. మరీ.. దిల్ రాజుపై వచ్చిన ఫిర్యాదుపై మహేష్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.