దసరా సినిమాల ఓవర్సీస్ లెక్కెంత ?

dasara moives

దసరా రేసులో మూడు సినిమాలు నిలిచిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ‘జై లవ కుశ’. మహేష్ బాబు ‘స్పైడర్’.. ఈ రెండు పెద్ద సినిమాల మధ్య శర్వానంద్ ‘మహానుభావుడు’ చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ మూడింటిలో ఇప్పటికే జై లవ కుశ, స్పైడర్ సినిమాలు రూ. 100కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. మరీ.. దసరా సినిమాల ఓవర్సీస్ లెక్కంత ?

యుఎస్ బాక్సాఫీస్ దగ్గర పది రోజుల్లో జై లవ కుశ రూ.9.85 కోట్లు వసూలు చేసింది. మహేష్ బాబు స్పైడర్ కేవలం ఐదు రోజుల్లోనే రూ.9.14 కోట్లు రాబట్టాడు. శర్వానంద్ మహానుభావుడు రెండు రోజుల్లో రూ.2.66 కోట్లు రాబ‌ట్టాయి. ఈ మూడు సినిమాలు కూడా తెలుగు రాష్ట్రాలతో పాటుగా.. ఓవర్సీస్ లోనూ ఫర్వాలేదనిపిస్తున్నాయి.

ఓవర్సీస్ లో ఎన్టీఆర్ నటించిన గత నాలుగు సినిమాలు మిలియన్ మార్క్ ని క్రాస్ చేశాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓవర్సీస్ లో మంచి రికార్డు ఉంది. ఈ యేడాది ఇప్పటికే శతమానం భవతితో యుఎస్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాడు శర్వా. ఇప్పుడు మహానుభావుడు హవా కొనసాగుతోంది.