deepika (4)

ఇటివలే హాలీవుడ్ సినిమా తో అదరగొట్టింది దీపికా పదుకొణె. ‘ట్రిఫ్లెక్స్‌:..తో సందడి చేసింది. ఇప్పుడు మరో ఇంటర్ నేషనల్ మూవీ కనిపించడానికి రెడీ అవుతోంది. . ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఓ ఇంటర్ నేషనల్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. చైనా అబ్బాయి…ఇండియా అమ్మాయి మధ్య ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నాడు.

ఇందులో కథానాయకుడిగా చైనా నటుడు డెంగ్‌ ఛావో నటిస్తున్నాడు. ఇందులో కథానాయిక పాత్ర కోసం దీపికాను ఖాయం చేశారని బాలీవుడ్‌ వర్గాలు టాక్. ఇప్పటికే హాలీవుడ్ అదుర్స్ అనిపించిది ప్రియంక చోప్రా. ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌తో పాపులర్‌ అయిన ప్రియాంక త్వరలోనే ‘బేవాచ్‌’తో వెండితెరపైనా సందడి చేయనుంది. ఇప్పుడు మరో ఇంటర్ నేషనల్ సినిమా ఒప్పుకొని దీపిక కూడా అక్కడ జెండా పాతలని డిసైడ్ అయ్యింది.

ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో పద్మవతి సినిమా చేస్తోంది దీపిక. రన్ వీర్ సింగ్ ఇందులో హీరోయిన్. ప్రియంక చోప్రా కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తుంది.

లేటెస్ట్ గాసిప్స్