మొన్నటి వరకు దిల్ రాజు బ్యానర్ నుండి సినిమా వస్తుందంటే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అని అంత ఫిక్స్ అయ్యారు. కానీ లవర్, శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ లు కావడం తో దిల్ రాజు ఫై నమ్మకాలు తగ్గాయి..ఆయన చెపుతుంది ఒకటైతే సినిమా పేరొకటిని అంత ఫిక్స్ అయ్యారు. దీంతో తన బ్యానర్ నుండి రాబోయే సినిమా పట్ల జాగ్రత్త పెంచాడు.
ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ నుండి రాబోతున్న చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే’. ఈ చిత్రంతో బౌన్స్‌బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు రాజు. అందుకే షూటింగ్ దశలో వుండగానే మార్పులు వుంటే చెప్పి, రీషూట్స్ చేయిస్తున్నాడట. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి సూపర్ హిట్స్ తెరకెక్కించిన త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడి ట్రాక్ రికార్డ్‌పై భరోసాతో వదిలేయడానికి దిల్ రాజు ఇష్టపడడం లేదు. మరోపక్క రామ్ మార్కెట్ కూడా పెద్దగా లేదు..ఈయన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అయినా దాఖలాలు లేవు. దీంతో ఈ చిత్రం విషయంలో రాజు చాల జాగ్రత్త తీసుకుంటున్నట్లు సమాచారం. మరి రాజు జాగ్రత్త సినిమాకు ఎంత సక్సెస్ ను ఇస్తుందో చూడాలి.