విజయ్ పై దర్శకుడి ఫిర్యాదు


టాలీవుడ్ సన్సేషనల్ విజయ్ దేవరకొండపై దర్శకుడు ఫిర్యాదు చేశాడు. కొత్త దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్. జులై26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే, విజయ్‌ దేవరకొండ తమని పనిచేసుకోనివ్వలేదని దర్శకుడు భరత్‌ కమ్మా సరదాగా అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట విడుదలైంది. ఈ సినిమాలోని రెండో పాటను ఆదివారం విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే పాటను విడుదల చేయలేకపోతున్నామని భరత్‌ కమ్మా ట్వీట్‌ చేశారు. దీనికి విజయ్‌ కారణమని తెలిపారు. ‘మీరు ఈ పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ప్రతి తరగతిలో ఇతరుల దృష్టి మళ్లించే ఓ చెడ్డ విద్యార్థి ఉన్నట్లే.. విజయ్‌ మమ్మల్ని పని చేసుకోనివ్వలేదు. దీనికి క్షమాపణ కోరుతున్నానని ట్విట్ చేశాడు భరత్ కమ్మ.