విజయ్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్టు ఇది !


కుర్రాళ్లలో విజయ్ దేవరకొండను మించినోడు లేడు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. రిలీజ్ కి ముందే లీకైన సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసేంత క్రేజ్ ని సొంతం చేసుకొన్నాడు. ముందే లీకైన విజయ్ ‘టాక్సీవాలా’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, బన్నీ.. ల కంటే ఎక్కువగా దర్శకులు విజయ్ ని కోరుకొంటున్నారు.

నితిన్, గోపీచంద్, రాజ్ తరుణ్, నిఖిల్ లాంటి హీరోలతో సినిమాలు చేసేందుకు అవకాశం ఉన్నా.. విజయ్ కోసం వెయిట్ చేస్తున్నారు కొందరు దర్శకులు. ఈ లిస్టులో దర్శకులు మారుతి, గోపీచంద్ మలినేని, పూరి జగన్నాధ్.. తదితరులు ఉన్నారు. చేతిలో కథలు పెట్టుకొని మరీ వెయిట్ చేస్తున్నారు. విజయ్ మాత్రం ఫుల్ బిజీ. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. మరో నాలుగు అడ్వాన్సులు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ పై ముగ్గురు దర్శకుల్లో ఒకరికైనా అవకాశం ఇచ్చేటట్టు కనిపించడం లేదు.