పవన్ ఇది.. నీకు న్యాయమా ?

pawan-anu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’కు ప్రశ్నించడం అలవాటు. ప్రశ్నించేందుకే ఆయన ‘జనసేన పార్టీ’ పెట్టారు. అవసరమైనప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు కూడా. అయితే, ఇప్పుడు పవన్’ని ఆయన అభిమానులే గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో.. పవన్ కి కూడా తెలుసు. ఇంతటీ అభిమానం పెట్టుకొన్న అభిమానులు దీపావళీ పండగ పూట.. తమ అభిమాన హీరో సినిమా నుంచి ఓ ఫస్ట్ లుక్, ఓ పోస్టర్ రావాలని ఆశపడటం తప్పా.. ? పవన్ అభిమానులు కూడా అదే చేసారు.

దీపావళీ కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్ 25వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వస్తుందని ఆశపడ్డారు. కానీ, పవన్ అభిమానులని ఘోరంగా నిరాశపరిచారు. అభిమానుల ఆశపెట్టుకొంటే తానకేంటని ఈ దీపావళీకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వకుండా సలైంట్ గా ఉండిపోయారు. కొందరు పవన్ వీరాభిమానులు ఆగపట్టుకోలేక.. పవన్ ఇది.. నీకు న్యాయమా ? అని ప్రశ్నిస్తున్నారు. మరీ.. వారికి పవన్ ఏం సమాధానం చెబుతాడో చూడాలి.

పవన్ – త్రివిక్రమ్ ల సినిమా ఇటీవలే కేరళ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. త్వరలోనే యూరప్ టూర్ కి వెళ్లనుంది. అక్కడ పవన్, హీరోయిన్స్ కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యూయేల్ పై పాటలని చిత్రీకరించనున్నారు. దీంతో.. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనని చెబుతున్నారు. ఇక, సినిమాని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.